న్యూఢిల్లీ: దేశ సరిహద్దులు మారవచ్చని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అలాగే పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం కూడా భారత్‌లోకి తిరిగి రావచ్చని అన్నారు. నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మాట్లాడారు. 1947లో దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన సింధ్ ప్రాంతం, సింధూ నది గురించి ఆయన ప్రస్తావించారు. ‘సింధ్ భూమి నేడు భారత్‌లో భాగం కాకపోవచ్చు. కానీ నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంటుంది. ఈ భూమి విషయానికొస్తే సరిహద్దులు మారవచ్చు. ఎవరికి తెలుసు, రేపు సింధ్ మళ్ళీ భారతదేశానికి తిరిగి రావచ్చు’ అని అన్నారు.
కాగా, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ గురించి ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. ఆయన పుస్తకంలో సింధ్ హిందువుల గురించి రాసినట్లు తెలిపారు. ‘సింధ్ హిందువులు, ముఖ్యంగా ఆయన తరానికి చెందినవారు, ఇప్పటికీ భారతదేశం నుంచి సింధ్ విడిపోవడాన్ని అంగీకరించడం లేదు. సింధ్‌లోనే కాదు, భారతదేశం అంతటా హిందువులు సింధూ నదిని పవిత్రంగా భావిస్తారు. సింధ్‌లోని చాలా మంది ముస్లింలు కూడా సింధూ నది నీరు మక్కాలోని ఆబ్-ఎ-జంజామ్ కంటే తక్కువ పవిత్రమైనది కాదని విశ్వసిస్తారు. ఇది అద్వానీ పుస్తకంలోనిది. సింధూ నదిని పవిత్రంగా భావించే మన సింధ్ ప్రజలు ఎల్లప్పుడూ మన సొంతమే. వారు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ మనవాళ్ళే’ అని అన్నారు.
#WATCH | Delhi: Defence Minister Rajnath Singh says, “…Today, the land of Sindh may not be a part of India, but civilisationally, Sindh will always be a part of India. And as far as land is concerned, borders can change. Who knows, tomorrow Sindh may return to India again…”… pic.twitter.com/9Wp1zorTMt
— ANI (@ANI) November 23, 2025
Also Read:
Chandigarh Bill Row | చండీగఢ్ బిల్లుపై వివాదం.. తుది నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం
Uranium In Breast milk | తల్లి పాలలో యురేనియం.. ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం