Mallikarjun Kharge | ముందు మీ చరిత్ర చూసుకోండి.. మోదీకి ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్
Mallikarjun Kharge | కాంగ్రెస్ మేనిఫెస్టో ‘ముస్లిం లీగ్ మేనిఫెస్టో’ (Muslim league) అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీ మతం పేరుతో దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై వ్యాఖ్యలు చేసేముందు.. వారి చరిత్ర ఏంటో తెలుసుకోవాలని దుయ్యబట్టారు.
Mallikarjun Kharge | దేశంలో లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) ప్రచారం వేడెక్కుతోంది. నేతలు ఓటర్లను ఆకర్షిచేందుకు రకరకాల హామీలను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో (Congress manifesto)ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘అది ముస్లిం లీగ్ మేనిఫెస్టో’ (Muslim league) మాదిరిగానే ఉందని వ్యాఖ్యానించారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే దాన్ని రూపొందించినట్లుగా కనిపించిందంటూ విమర్శలు చేశారు. మోదీ వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విరుచుకుపడ్డారు. మోదీ మతం పేరుతో దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై వ్యాఖ్యలు చేసేముందు.. వారి చరిత్ర ఏంటో తెలుసుకోవాలని దుయ్యబట్టారు.
‘వాళ్లు (బీజేపీ) ముందుగా వారి చరిత్ర చూసుకోవాలి. వారి సిద్ధాంతకర్త బెంగాల్లో ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మతం పేరుతో వాళ్లే దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ మనస్సులో కేవలం హిందూ-ముస్లిం మాత్రమే ఉంది. మతం పేరుతో దేశాన్ని విభజించడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. మా కాంగ్రెస్ మేనిఫెస్టోని వాళ్లు సరిగ్గా చదవలేదు. మేము యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పాం. మహిళలకు సంవత్సరానికి రూ.1 లక్ష ఇస్తామని హామీ ఇచ్చాం. రైతులకు కనీస మద్దతు ధర (MSP) గ్యారెంటీ.. ఇవన్నీ ముస్లిం లీగ్లో భాగమా..?’ అని ఖర్గే ప్రశ్నించారు.
Also Read..
Siddaramaiah | మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. బీజేపీపై సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు
Bus Accident | కంటైనర్ లారీని ఢీ కొట్టిన బస్సు.. 11 మందికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

