Indian Origin | డెలివరీ డ్రైవర్ దారుణ హత్య.. యూకేలో నలుగురు భారత సంతతి వ్యక్తులకు కఠిన కారాగార శిక్ష
Indian Origin | బ్రిటన్‌లో ఓ భారత సంతతి (Indian Origin) డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు స్థానిక కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది.
Indian Origin | బ్రిటన్‌లో ఓ భారత సంతతి (Indian Origin) డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు స్థానిక కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులకు 122 ఏళ్ల జైలు శిక్ష వేసింది.
వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి ఆర్మాన్ సింగ్ (23) డెలివరీ డ్రైవర్ (delivery driver)గా పనిచేస్తున్నాడు. అయితే గతేడాది ఆగస్టులో అతడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ ఇంగ్లాండ్‌లోని ష్రూస్ బెర్రీలో నలుగురు భారత సంతతి వ్యక్తులు అర్షదీప్ సింగ్, జగ్దీప్ సింగ్, శివ్‌దీప్ సింగ్, మన్‌జ్యోత్ సింగ్.. ఆర్మాన్ సింగ్‌పై దాడి చేసి దారుణంగా చంపేశారు. గొడ్డలి, గోల్ఫ్ క్లబ్, మెటల్ క్లబ్, హాకీ స్టిక్, పార, చెక్క కర్ర, క్రికెట్ బ్యాట్, కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చారు. ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ హత్య కేసులో ఐదో వ్యక్తి పీటర్‌బరోకు చెందని సుఖ్‌మన్‌దీప్ సింగ్ పాత్ర కూడా ఉంది. అతడు డెలివరీ చేసేందుకు వెళ్తున్న ఆర్మాన్ సింగ్ గురించిన సమాచారాన్ని ఆ నలుగురు వ్యక్తులకు అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వెస్ట్మెర్సియా పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా స్థానిక కోర్టు తాజాగా శిక్ష విధించింది. ఆర్మాన్దీప్ను హత్య చేసిన నిందితులు నలుగురికి ఒక్కొక్కరికి 28 ఏళ్లు చొప్పున శిక్ష వేసింది. అదే సమయంలో ఆర్మాన్ దీప్ గురించిన సమాచారాన్ని అందించిన సుఖ్‌మన్‌దీప్ సింగ్‌కు మాత్రం పదేళ్ల శిక్ష వేసింది. మొత్తం ఐదుగురికి కలిపి 122 ఏళ్ల శిక్ష ఖరారైంది. నిందితులందరికీ కఠిన శిక్షలు పడినందుకు స్థానిక పోలీసు ఉన్నతాధికారి హర్షం వ్యక్తం చేశారు. దారుణ నేరాలకు పాల్పడేవారు చట్టం నుంచి తప్పించుకోలేరని, ఇందుకు తాజా శిక్షలే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.
Also Read..
Khyber Temple | పాకిస్థాన్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ కోసం చారిత్రక హిందూ ఆలయాన్ని కూల్చేశారు
Siddaramaiah | మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. బీజేపీపై సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు
Ganja | గచ్చిబౌలిలో గంజాయి సీజ్.. యువకుడు అరెస్టు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

