Ganja | గచ్చిబౌలిలో గంజాయి సీజ్.. యువకుడు అరెస్టు
హైదరాబాద్‌లో మరోసారి గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలోని ఏపీహెచ్‌బీ కాలనీలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు సీజ్‌చేశారు. గంజాయి అమ్ముతున్న యువకుడిని అరెస్టు చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలోని ఏపీహెచ్‌బీ కాలనీలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు సీజ్‌చేశారు. గంజాయి అమ్ముతున్న యువకుడిని అరెస్టు చేశారు. అతని నుంచి 250 గ్రాముల మత్తుమందు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మకానికి సిద్ధం చేశాడని చెప్పారు. నిందితుడిని బసవ రాజప్ప ప్రమోద్‌గా గుర్తించారు. గంజాయిని దూల్‌పేట నుంచి సేకరించాడని, దానిని చిన్న ప్యాకెట్లుగా చేసి కూలీలకు విక్రయిస్తున్నాడని చెప్పారు.
మరో ఘటనలో గచ్చిబౌలిలోని ఓయో లాడ్జ్‌లో గ్యాంబ్లింగ్ ఆడుతున్న ముగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజరాజేశ్వర కాలనీలో ఉన్న సిల్వర్ కీ ఓయో లాడ్జ్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడిచేశారు. పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.52 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు బస్వరాజ్ తప్పించుకున్నాడని పోలీసులు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
NHRC | తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల దుస్థితిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
Vishwambhara | ఎట్టకేలకు ఊపందుకున్న మెగాస్టార్ ‘విశ్వంభర’.. ట్రైలర్ రెడీ, రిలీజ్ డేట్ ఎప్పుడో?
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

