Khyber Temple | పాకిస్థాన్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ కోసం చారిత్రక హిందూ ఆలయాన్ని కూల్చేశారు
పాకిస్థాన్‌లో హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ (Commercial complex) నిర్మాణం కోసం చారిత్రక హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ (Commercial complex) నిర్మాణం కోసం చారిత్రక హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తున్క్వా ప్రావిన్స్‌లోని లాండి కోటల్ బజార్ పట్టణంలో పురాతన ఆలయం (Historic Hindu Temple) ఉన్నది. అంతా దానిని ఖైబర్ టెంపుల్ (Khyber Temple) అని పిలుస్తారు. దేశ విభజన సమయంలో అక్కడనున్న హిందువులంతా భారత్‌కు వలస వెళ్లడంతో 1947లోనే అది మూతపడింది. అప్పటి నుంచి పట్టించుకునే వారు లేకపోవడంతో క్రమంగా శిథిలావస్థకు చేరింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ఆలయాన్ని కూల్చివేశారు. గత పది 15 రోజులుగా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతున్నదని స్థానికులు వెల్లడించారు. నిర్మాణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు నిర్థారించారు. ఆ ప్రాంతంలో ఆలయం ఉన్నట్లు తమ వద్ద ప్రామాణికమైన, క్రమబద్ధమైన రెవెన్యూ రికార్డులు లేవని చెప్పడం గమనార్హం.
కాగా, దీనికి సంబంధించి ఇబ్రహిం షిన్వారీ అనే పాక్ జర్నలిస్టు మాట్లాడుతూ.. లాండి కోటల్ బజార్ నడిమధ్యలో చారిత్రక దేవాలయం ఉంది. 1947లో భారత్-పాకిస్థాన్ విభజన తర్వాత హిందూ కుటుంబాలకు ఇండియాకు తరలివెళ్లడంతో అది మూతపడింది. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన్నపుడు ఇక్కడ కొందరు వ్యక్తులు ఆలయాన్ని ధ్వంసం చేశారు. తన బాల్యంలో ఈ ఆలయాన్ని గురించి చాలా కథలు విన్నామని చెప్పారు. ప్రస్తుతం దానిని కూల్చివేసి వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు.
మరోవైపు, ముస్లిమేతరుల మతపరమైన ప్రాముఖ్యత కలిగిన చారిత్రక కట్టడాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పాకిస్థాన్ హిందూ దేవాలయ నిర్వహణ కమిటీ హరూన్ సర్బాడియాల్ అన్నారు. మతపరమైన మైనారిటీల పట్ల ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైతే అన్ని ప్రార్థనా స్థలాలు, చారిత్రక కట్టడాలు కనుమరుగవుతాయని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

