AAP | హర్యానా (Haryana Elections), జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ (Jammu Kashmir) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హర్యానా ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ కొనసాగుతుండగా.. జమ్మూ కశ్మీర్లో మాత్రం ఎన్సీ, కాంగ్రెస్ కూటమి హవా కొనసాగిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్‌లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది.
ఇక ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేసిన ఏ ఒక్కస్థానంలోనూ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.
హర్యానాలో ఉత్కంఠ..
హర్యానా ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది. ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా.. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. 90 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రస్తుతం బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. బీజేపీ 49 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. కాంగ్రెస్ 35 స్థానాల్లో ముందంజలో ఉంది.
జమ్మూ కశ్మీర్లో..
అటు జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి హవా కొనసాగిస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం 90 స్థానాలకు గానూ నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి 52 స్థానాలతో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. బీజేపీ 26 స్థానాల్లో ముందంజలో ఉంది. పీడీపీ నాలుగు స్థానాల్లో, ఇతరులు ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
Also Read..
Kangana Ranaut | కంగనా రనౌత్‌కు జబల్పూర్ ప్రత్యేక కోర్టు నోటీసులు
Omar Abdullah: ఆధిక్యంలో నేషనల్ కాన్ఫరెన్స్.. సెల్ఫీ పోస్టు చేసిన ఒమర్ అబ్దుల్లా
Mohamed Muizzu | తాజ్ మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు