Mohamed Muizzu | మాల్దీవుల అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) భారత పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన తాజ్ మహల్ (Taj Mahal)ను సందర్శించారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ (Sajidha Mohamed)తో కలిసి ఇవాళ ఉదయం ఆగ్రా చేరుకున్న ముయిజ్జు.. తాజ్ అందాలను వీక్షించారు. ఈ సందర్భంగా అక్కడ ఫొటోలు దిగారు.
మరోవైపు తన పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో ముయిజ్జుల సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. తనని భారత్‌కు ఆహ్వానించినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. మాల్దీవులలో పర్యటించే వారిలో భారతీయులే అధికం కావడంతో వీరి సమావేశంలో టూరిజం అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చింది. ఇప్పటికే ఎంతో మంది భారతీయులు మాల్దీవులను సందర్శిస్తుంటారని.. భవిష్యత్తులో మరింత మంది సందర్శిస్తారని కోరుకుంటున్నానని మొయిజ్జు అన్నారు.
‘మాల్దీవులకు అవసరం వచ్చిన ప్రతిసారి భారత్ వెన్నంటి ఉంది. స్నేహ హస్తం అందిస్తోంది. అలాగే తమ దేశ ఆర్థికాభివృద్ధిలో భారత్‌ది ఎంతో కీలక పాత్ర’ అని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి మాల్దీవులకు అండగా నిలుస్తోన్న ప్రధాని మోదీతోపాటు భారతీయులకు తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, మాల్జీవుల బంధం వందల ఏళ్ల నాటిదన్నారు. అయితే గతంలో మొయిజ్జు చేసిన వ్యాఖ్యలకు ఈ వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం.
Also Read..
Kamala Harris | అధ్యక్షురాలిగా గెలిస్తే నేను పుతిన్‌ను కలవను : కమలా హారిస్
Haryana Elections | హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ.. క్షణక్షణానికి మారుతున్న ఫలితాల సరళి
Hyderabad Metro | మెట్రో మార్గం గజిబిజి.. గందరగోళంగా రెండో దశ కారిడార్లు