Kamala Harris | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రష్యా- ఉక్రెయిన్ల శాంతి (Ukraine – Russia War) చర్చల్లో భాగంగా పుతిన్‌ను కలవబోనని స్పష్టం చేశారు.
రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడిని కలుస్తారా..? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు కమలా హారిస్ ఈ విధంగా జవాబిచ్చారు. ‘ఉక్రెయిన్ లేకుండా ద్వైపాక్షిక చర్చలు కావు. ఉక్రెయిన్ భవిష్యత్తుపై ఆ దేశమే చెప్పాలి’ అని ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌పై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విధానాలపై హారిస్ మండిపడ్డారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే పుతిన్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని కీవ్‌లో అధికారాన్ని సాధించేవారు అన్నారు.
Also Read..
Haryana Elections | హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ.. క్షణక్షణానికి మారుతున్న ఫలితాల సరళి
Ananya Pandey | అమ్మ దాన్ని డీయాక్టివేట్ చేసింది..: అనన్య పాండే
Hyderabad Metro | మెట్రో మార్గం గజిబిజి.. గందరగోళంగా రెండో దశ కారిడార్లు