Haryana Elections | హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల (Haryana Elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. తొలుత ఇక్కడ హస్తం పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. రాష్ట్రంలోని 90 సీట్లలో 63 చోట్ల ముందంజలో కొనసాగగా.. బీజేపీ 23 స్థానాలకు పరిమితమైంది.
అయితే కాసేపటికే అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. బీజేపీ 46 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ 38 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ఐఎన్ఎల్డీ మూడు స్థానాలు, ఇతరులు మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవకపోవడం గమనార్హం.
జులానా స్థానంలో భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్ లీడింగ్‌లో ఉన్నారు. లడ్వాలో సీఎం నయాబ్‌సింగ్ సైనీ ఆధిక్యంలో మూదుసుకెళ్తున్నారు. ఈ నెల 5న ఒకే విడుతలో జరిగిన ఎన్నికల్లో 67.09 శాతం పోలింగ్ నమోదయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ దాటాల్సి ఉంటుంది. మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీచేశారు.
Also Read..
Tirumala | మోహినీ అవతారంలో మలయప్పస్వామి..
M S Subbulakshmi Award: ఆయనకు అవార్డు ఇవ్వొద్దు.. కోర్టుకెళ్లిన ఎంఎస్ సుబ్బలక్ష్మీ మనవడు
RTC | ఆర్టీసీకి అద్దె బస్సుల గండం.. ప్రైవేటీకరణ వైపు అడుగులు?