Ananya Pandey | ‘కంట్రోల్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతున్నది బాలీవుడ్ భామ అనన్య పాండే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటిగా తన మనసులోని కోరికలను బయటపెట్టింది అనన్య. ‘కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ చాలా జానర్లలో నటించాను. కానీ రొమాంటిక్ సినిమాలు, హారర్ సినిమాలు, బయోపిక్‌లు ఇప్పటివరకూ చేయలేదు. ఆ తరహా కథలు వస్తే మాత్రం వదులుకోను. అలాగే.. కరణ్‌జోహార్ ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ సినిమాలో ఓ చిన్న పాత్ర చేశాను.
అలా కాకుండా ఆయన దర్శకత్వంలో పూర్తిస్థాయి హీరోయిన్గా నటించాలని ఉంది. బాలీవుడ్లో నాకిష్టమైన డైరెక్టర్ సంజయ్‌లీలా బన్సాలీ. ఆయన సినిమాలో ఛాన్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. మరి ఈ కోరికలన్నీ ఎప్పటికి తీరతాయో చూడాలి. ప్రస్తుతానికైతే కెరీర్ పరంగా బిజీగా ఉన్నా.’ అని చెప్పింది అనన్య.
ఇంకా తన సోషల్ మీడియా అకౌంట్ గురించి కూడా మాట్లాడుతూ ‘చిన్నప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తే మా అమ్మ దాన్ని డీ యాక్టివేట్ చేసింది. 18ఏండ్లు నిండాక మళ్లీ సోషల్‌మీడియాలోకి వచ్చాను. సమయం దొరికినప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటా.’ అని చెప్పింది