Gandhi statue | బస్తీల జోలికొస్తే ఉద్యమిస్తాం..బస్తీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ, మూసీ పరీవాహక ప్రజలు వ్యతిరేకంగా కాదని.. సుందరీకరణ పేరిట ప్రజల ఇండ్లను కూల్చడాన్నే వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.
- గాంధీ విగ్రహం కట్టేందుకు బస్తీలను కూల్చాలా?
- సుందరీకరణ పేరిట ఇండ్లు కూల్చేస్తామంటే సహించం
- బస్తీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ, మూసీ పరీవాహక ప్రజలు వ్యతిరేకంగా కాదని.. సుందరీకరణ పేరిట ప్రజల ఇండ్లను కూల్చడాన్నే వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. గాంధీ మీద, ఆయన సిద్ధాంతాల మీద అంత ప్రేమ ఉంటే 50 ఎకరాల్లో కట్టండి కానీ పేదల ఇండ్లు కూల్చేస్తామంటే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ‘మూసీ తీరాన బస్తీ పోరాటం’ అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క ఇంటిని కూడా ముట్టుకోకుండా 32 ఎస్టీపీలను నిర్మిం చి, మూసీని సుందరీకరించి చూపించామని గుర్తుచేశారు. హైదరాబాద్ బస్తీ పేదలతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఒక్కరు కూడా ఆకలితో ఉండొద్దని నాడు కేసీఆర్ అన్ని రకాలుగా ఆదుకొని కడుపున పెట్టుకుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్‌రెడ్డి వారి కడుపు మీద కొడుతున్నారని మండిపడ్డారు. రెండున్నరేండ్ల నుంచి కూల్చివేతలు, కమీషన్ల దం దా తప్ప రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజలపై కక్షగ ట్టి ఇండ్లను కూల్చేస్తూ రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు.
మూసీని మురికి కూ పం నుంచి బయటపడేసేందుకు కాలుష్య కారకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించి వాటిని నివారించాలని సూచించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు రిటెయినింగ్ వాల్స్ కట్టి శుద్ధి చేస్తే సరిపోతుందని అన్నారు. అలా కూల్చాలనుకుంటే మూసీ పరీవాహకంలో పెద్దపెద్ద కట్టడాలున్నాయ ని, ముందు వాటిని కూల్చాలని సూచించారు. పేదల ఇండ్లను కూలుస్తామంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి వారికి మద్దతుగా నిలుస్తున్న గోసుల శ్రీనివాస్ యాదవ్‌ను ఆయ న అభినందించారు. జేఏసీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉద్యమంలో భాగమవుతామని స్పష్టం చేశారు.
బస్తీలు లేకుంటే ఈ ప్రభుత్వం ఎక్కడిది?
బస్తీలు, బస్తీ ప్రజలు లేకుండా రేవంత్ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చిందని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు నిలదీశారు. వివిధ బస్తీలతోపాటు గేటెడ్ క మ్యూనిటీల నుంచి మూసీ పరీవాహక బా ధితులు హాజరై సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పైసాపైసా కూడబెట్టుకొని 40 ఏండ్ల కింద కట్టుకున్న ఇండ్లను ఇప్పుడు కూలుస్తామంటే ఎక్కడికిపోయి బతకాలని ఆవేదన వ్యక్తంచేశారు.
బాధతో చాలామంది బస్తీ ప్రజలు గుండెపోటుతో చనిపోతున్నారని తెలిపారు. మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, మూసీ జన ఆందోళన సంఘటన్ ప్రతినిధులు హాజరై బస్తీ జేఏసీకి మద్దతు తెలిపారు. బస్తీలను కూల్చాలని చూస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని హెచ్చరించారు. ఇండ్లను కూల్చి టూరి జం పేరిట విలువైన భూములను బడా వ్యాపార వేత్తలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నీటి వనరుల నిపుణుడు ప్రకాశ్, ప్రొఫెసర్లు, మూసీ బాధిత ప్రజలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

