న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. 90 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో తాజా సమాచారం ప్రకారం ఎన్సీ, కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉన్నది. కూటమిలో కీలకమైన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 39 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. ఆ పార్టీ ముఖ్యనేత ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) రెండు స్థానాల నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బుద్గామ్, గందేర్బల్ నుంచి ఆయన పోటీ చేశారు. అయితే ఆ రెండు స్థానాల్లోనూ ఆయన లీడింగ్‌లో ఉన్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్, ఎన్సీ కూటమి ఇప్పటికే 51 సీట్ల మార్క్‌కు చేరుకున్నాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఇవాళ ఉదయం ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్ చేశారు. మార్నింగ్ వాక్ చేస్తూ ఫోటోను పోస్టు చేశారు. ఇవాళ కౌంటింగ్ రోజు అని, గత కౌంటింగ్ రోజు వ్యక్తిగతంగా కలిసి రాలేదని, కానీ ఈసారి కలిసి వస్తుందని ఆ అల్లాను వేడుకుంటున్నట్లు తన ట్వీట్లో తెలిపారు.
Counting day 7K done. Last time around it didn’t end well for me personally. InshaAllah this time around it will be better. pic.twitter.com/TUkjLtVKGn
— Omar Abdullah (@OmarAbdullah) October 8, 2024