Kangana Ranaut | బాలీవుడ్ స్టార్ నటి, మండి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)కు మధ్యప్రదేశ్ కోర్టు నోటీసులు అందించింది. కంగన గతంతో ఓ సారి మాట్లాడుతూ.. 2014లో మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాతే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందంటూ (India got freedom in 2014) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఇక కంగన వ్యాఖ్యలపై న్యాయవాది అమిత్ కుమార్ సాహు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదుపై అధర్తల్ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో 2021లో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇటీవలే జబల్పూర్ (Jabalpur)లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు (special MP-MLA court)కు బదిలీ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశ్వేశ్వర మిశ్రా.. కంగనకు నోటీసులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణ నవంబర్ 5కు వాయిదా వేసింది.
Also Read..
Haryana Elections | హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ.. క్షణక్షణానికి మారుతున్న ఫలితాల సరళి
Mohamed Muizzu | తాజ్ మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
Kamala Harris | అధ్యక్షురాలిగా గెలిస్తే నేను పుతిన్‌ను కలవను : కమలా హారిస్