Supreme Court : విదేశాలకు వెళ్లేందుకు తనను అనుమతించాలంటూ షీనా బోరా (Sheena Bora) హత్య కేసు (Murder Case)లో కీలక నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జి (Indrani Mukerjea) చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు (Supreme Court) తోసిపుచ్చింది. ఆమె విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ ఎంఎం సుందరేశన్, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కుడిన సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఈ కేసు విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మీరు విదేశాల నుంచి తిరిగి వస్తారనే గ్యారెంటీ లేదు. కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ దశలో మీ అభ్యర్థనను పరిశీలించలేం. విచారణను వేగవంతం చేసి ఏడాదిలోగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తు్న్నాం’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇంద్రాణి ముఖర్జి ట్రయిల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా సుప్రీం ధర్మాసనం అనుమతించింది. ముఖర్జి విదేశాలకు వెళ్లేందుకు చేసుకున్న అభ్యర్థనను సీబీఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఇది సున్నితమైన కేసు అని, విచారణ సగానికి పైగా పూర్తయిందని, 96 మంది సాక్ష్యులను విచారించామని కోర్టుకు తెలిపారు.
ముఖర్జి తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చిందని, అయితే ఈ కేసులో ఇంకా 92 మంది సాక్ష్యులను విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. నాలుగు నెలలుగా ట్రయిల్ కోర్టు చేసిందేమీ లేనందున విచారణ మరింత జాప్యం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇంద్రాణి ముఖర్జి స్పెయిన్, యూకే పర్యటనకు ప్రత్యేక కోర్టు గత జూలై 19న అనుమతి ఇచ్చింది. దీనిపై సీబీఐ ముంబై హైకోర్టుకు వెళ్లడంతో ప్రత్యేక కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని ఇంద్రాణి ముఖర్జి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే 2012లో తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జి 2015 నుంచి జైలులో ఉంటోంది. ఆమెకు 2022లో సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Kamal Haasan | రాజ్యసభకు కమల్ హాసన్.. మంత్రితో సమాచారం పంపిన తమిళనాడు సీఎం స్టాలిన్..!
Medaram Jatara | సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర.. పెద్దసంఖ్యలో తరలివస్తున్న భక్తులు
Ram Temple Priest | అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత
Freebies: ఎన్నికలకు ముందు ఉచిత వాగ్ధానాలు.. ఆ వైఖరిని తప్పుపట్టిన సుప్రీంకోర్టు
Anil Vij | బీజేపీ మంత్రి అనిల్ విజ్‌కు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీస్.. ఆయన ఎలా స్పందించారంటే?