Kamal Haasan : మక్కల్ నిది మయ్యమ్ (MNM) పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ను తమిళనాడులోని అధికార డీఏంకే (DMK) పార్టీ రాజ్యసభ (Rajya Sabha) కు పంపనుంది. ఈ మేరకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. తన క్యాబినెట్ మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపినట్లు తెలిసింది. కాగా ఈ ఏడాది జూలైలో డీఏంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను పెద్దల సభకు పంపేందుకు డీఏంకే సమాయత్తమైంది.
గత ఏడాది మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఏంకేతో MNM పొత్తు పెట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో కోయంబత్తురు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు. కోయంబత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఈ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు. దాంతో డీఏంకే అధినేత సూచన మేరకు అక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనను కమల్ హాసన్ విరమించుకొన్నారు.
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్ సభ స్థానం నుంచి పోటీచేసిన కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపుతున్నారు. తద్వారా చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపాలనేది డీఎంకే ఆలోచన.
Medaram Jatara | సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర.. పెద్దసంఖ్యలో తరలివస్తున్న భక్తులు
Ram Temple Priest | అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత
Freebies: ఎన్నికలకు ముందు ఉచిత వాగ్ధానాలు.. ఆ వైఖరిని తప్పుపట్టిన సుప్రీంకోర్టు
Anil Vij | బీజేపీ మంత్రి అనిల్ విజ్‌కు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీస్.. ఆయన ఎలా స్పందించారంటే?