Freebies: ఎన్నికలకు ముందు ఉచిత వాగ్ధానాలు.. ఆ వైఖరిని తప్పుపట్టిన సుప్రీంకోర్టు
Freebies : ఉచిత రేషన్, డబ్బు అందడం వల్ల.. ప్రజలు ఎవరూ పనిచేయడానికి ఇష్టపడడం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎన్నికలకు ముందు ఉచిత వాగ్ధానాలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు ఉచిత వాగ్ధానాలు(Freebies) ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఉచిత ప్రకటనలు సరికాదు అని పేర్కొన్నది. ఆ విధానాన్ని కోర్టు వ్యతిరేకించింది. ఉచిత రేషన్, డబ్బు అందడం వల్ల.. ప్రజలు ఎవరూ పనిచేయడానికి ఇష్టపడడం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజకీయ పార్టీలు చేస్తున్న ఉచిత వాగ్ధానాలను సుప్రీంకోర్టు నిలదీసింది. దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, సమాజంలో ప్రజల పాత్రను పెంచాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరణణి వాదిస్తూ.. పట్టణాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇండ్లు లేని వారి కోసం షెల్టర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పట్టణ పేదరిక నిర్మూలన స్కీమ్ ఎప్పటి నుంచి అమలు అవుతుందో కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాలని అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టు కోరింది.
జస్టిస్ బీఆర్ గవాయి, ఆగస్టిన్ జార్జ్ మాషిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. షెల్టర్ హోమ్స్ గురించి దాఖలైన పిటీషన్‌పై విచారిస్తూ కోర్టు ఇలా వ్యాఖ్యానించింది. ఫ్రీ రేషన్ వస్తోందని, పని చేయకుండానే పైసలు వస్తున్నాయని జస్టిస్ గవాయ్ తెలిపారు. ప్రజల పట్ల ఉన్న శ్రద్దను మెచ్చుకుంటున్నామని, కానీ వాళ్లను పనిచేసేలా తయారు చేయవద్దు అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. మరో ఆరు వారాల తర్వాత కేసుపై విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

