Bhikhari Singh : గ్రేటర్ నోయిడా (Greater Noida) వరకట్న (Dowry) హత్య కేసు (Murder case) లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే మృతురాలి భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఆమె అత్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆమెను ఇంటరాగేట్ చేస్తున్నారు.
మృతురాలు నిక్కీ అత్త అరెస్టుపై ఆమె తండ్రి భికారీ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. పాలనా యంత్రాంగం చక్కగా పనిచేస్తోందని అన్నారు. ఆ రాక్షసులు తన కుమార్తెను తగులబెట్టి చంపారని, నా బిడ్డ అత్తను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇదంతా జరగడానికి ఆమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
తల్లి అంటే పిల్లలకు మంచిచెడుల గురించి చెబుతారని, చెడు మార్గాన్ని వదిలి మంచి మార్గంలో నడవాలని సూచిస్తారని, కానీ ఆమె అందుకు భిన్నంగా ప్రవర్తించారని చెప్పారు. కొడుకును వేధింపులకు పాల్పడకుండా నియంత్రించడానికి బదులుగా ఆమె అతడిని ప్రోత్సహించిందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు ఉరిశిక్ష పడాల్సిందేనని అన్నారు.
#WATCH | Greater Noida dowry murder case | The deceased’s mother-in-law has also been arrested.
Victim’s husband, Vipin Bhati, accused of murdering his wife, Nikki, over dowry demands, was arrested earlier after getting injured in a police encounter
(Video Source: Greater… https://t.co/7ehENvOKUI pic.twitter.com/9kHOVydy8m
— ANI (@ANI) August 24, 2025