హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) 16 మంది కో ఆప్టెడ్ మెంబర్లను నామినేట్ చేసింది. ఈ మేరకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు గురువారం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ప్రతి రెండేండ్లకు ఒకసారి కో ఆప్టెడ్ మెంబర్లను ఎంపిక చేయగా, వీరు టీజీఎంసీ ఆయా కమిటీల్లో భాగస్వాములుగా ఉంటారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’, ‘యాంటీ క్వాకరీ’ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు చేపట్టనున్నారు.