హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ గురువారం సింగరేణిభవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సింగరేణిభవన్కు చేరుకున్న ఆయనకు సంస్థ జీఎం (కోఅండ్ఎం) తాడబోయిన శ్రీనివాస్ సాదర స్వాగతం పలికారు.
అనంతరం జ్యోతి బుద్ధప్రకాశ్ చైర్మన్ ఆఫీసులో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కే వెంకటేశ్వర్లు (పీ అండ్పీ), గౌతంపోట్రు (పీ అండ్ ఎఫ్), బీ వెంకన్న (ఈడీ కోల్ మూవ్మెంట్) చైర్మన్కు పుష్పగుచ్ఛాలు అందించి శుభకాంక్షలు తెలిపారు.