తిరువనంతపురం: పోటీ పరీక్షల పేపర్ లీకేజీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదమైంది. దీంతో బీజేపీ నేతలు ఎంపీ శశిథరూర్‌పై విమర్శలు చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలను శశిథరూర్ ఎప్పుడూ నిందిస్తుంటారని ఆరోపించారు. తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆన్సర్ షీట్‌ను షేర్ చేసిన ఎంపీ శశిథరూర్.. దాంట్లో దేన్ని ఉత్తర్‌ప్రదేశ్ అని పిలుస్తారని హిందీలో ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు హిందీలోనే సమాధానం కూడా ఇచ్చారు. ఏ ప్రదేశంలో అయితే పరీక్ష కన్నా ముందే సమాధానం బయటకు వస్తుందే దాన్ని ఉత్తరప్రదేశ్ అంటారని పేర్కొన్నారు. ఎంపీ శశిథరూర్ చేసిన ఈ పోస్టుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల యూజీసీ-ఎన్ఈటీ పరక్షను రద్దును చేయడం, నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు చోటుచేసుకోవడం వల్ల .. పేపర్ లీకేజీలు తీవ్రమైన అంశంగా మారాయి.
शानदार! #परीक्षापेचार्चा pic.twitter.com/xXK8q54FWl
— Shashi Tharoor (@ShashiTharoor) June 22, 2024
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు. ఈశాన్య రాష్ట్రాలపై ఎప్పుడూ కామెంట్ చేసే ఎంపీ శశి ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ను టార్గెట్ చేశారని సీఎం బిశ్వశర్మ తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా రియాక్ట్ అయ్యారు. తోటి భారతీయుల్ని అవమానించడం తగదన్నారు. కాంగ్రెస్ పద్ధతి అదే అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మరో నేత పిట్రోడా కూడా భారతీయుల్ని ఆఫ్రికన్లతో పోల్చారన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందిస్తూ మన నాగరికతకు యూపీ ఎంతో చేసిందని, ఎంతో మంది రాజకీయ, సాహితీవేత్తలను అందించిందని, కాంగ్రెస్ నేతలు నివాళ్లు అర్పించే ఆ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ కూడా ఇక్కడిదే అన్నారు. ఎంపీ శశిథరూర్ పదేపదే తప్పులు చేస్తుంటారని బీజేపీ జాతీయ ప్రతినిధి సీఆర్ కేశవన్ తెలిపారు.
This gentleman frequently indulges in satirizing various cultures (first Northeast and now UP) with remarkably caustic words.
He has succumbed to the beguiling whispers of lunacy, his mind adrift in the ethereal mists of derangement. https://t.co/aGuUU61bAy
— Himanta Biswa Sarma (@himantabiswa) June 23, 2024