పాలకుర్తి/ కొడకండ్ల, డిసెంబర్ 13 : రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపు కోరుతూ శనివారం పాలకుర్తి మండలం దర్దేపల్లి, పాలకుర్తి, టీఎస్కేతండా, దుబ్బతండా, కొండాపురం, మేకల తండా, రాఘవపురం, కొడకండ్ల మండలం పెద్దబాయి తండా, రామన్నగూడెం, లక్ష్మక్కపల్లి, మొండ్రాయి,గిర్నితండా, రంగాపురం, రేగుల గ్రామాల్లో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని మండిపడ్డారు. రైతుల కష్టాలను తీర్చడంలోనూ విఫలమైందన్నారు.
యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారన్నారు. మహిళ సంఘాల డబ్బులతోనే మహిళలకు చీరలు పంపిణీ చేశారని ఆరోపించారు. రెండేళ్లలో పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఓట్ల కోసం గ్రామాలకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా పాలకుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎండగడుతూ, సీఎంగా కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని సూచించారు.
బీఆర్ఎస్లో చేరికలు
పాలకుర్తి మండలం చీమలబావి తండా, పాలకుర్తి, గ్రామాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరమనేని శ్రీనివాసరావు, గాందారి సంపత్, విస్నూరు మాజీ సర్పంచ్ దేశ్యానాయక్, ఎన్ఎస్యూఐ నాయకుడు దిలీప్‌నాయక్, కొడకండ్ల మండలం రంగాపురంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాకా సంతోష్, కత్తి మల్లయ్యతో పాటు పలువురు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వోనించారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు పాము శ్రీనివాస్, సర్పంచ్ అభ్యర్థులు ఘణపురం రేణుక సురేశ్, ధరావత్ శ్రీనివాస్, గుగులోత్ దేవా, గడ్డం కిరణ్, లకావత్ స్వర్ణసుధాకర్, నల్లా నాగిరెడ్డి, నాయకులు గిరగాని సమ్మయ్య, లావుడ్యా దేవేందర్, గుగులోతు లక్పతి, పాలకుర్తి రాఘవరావు, ఇమ్మడి ప్రకాశ్, మంగ సోమయ్య, కాలురాం, రాపాక ఆశోక్, కడుదుల కర్ణాకర్‌రెడ్డి, వీరమనేని సోమేశ్వర్రావు, కత్తుల యాకయ్య, వీరమనేని తిమ్మారావు, బెల్లి యుగేంధర్, సలేంద్ర రమ పాల్గొన్నారు.