హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ చేశారు. రామేశ్వరం కేఫ్ రుచులు, అక్కడ లభించే స్పెషల్ టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేశ్ ఆసక్తి మేరకు కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందు భోజనంలో దక్షిణాది రుచులను ఆస్వాదిస్తూనే ఇద్దరు నేతలు సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు.