Bulldozers | పేదల బతుకులపైకి బుల్డోజర్లు..జేసీబీకి అడ్డంగా పడుకున్న బాధితులు
Bulldozers | కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో సీఎంసీ అధికారులు చేపట్టిన ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
కొండాపూర్ : కొండాపూర్ ( Kondapur ) రాఘవేంద్ర కాలనీలో సీఎంసీ అధికారులు చేపట్టిన ఫుట్ పాత్ ( Footpath ) ఆక్రమణల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రోడ్డుకు సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న చిరు వ్యాపార దుకాణాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు నిరసన ( Victims Protests ) వ్యక్తం చేశారు.
పేదల జీవనాధారమైన దుకాణాలను కూల్చొద్దంటూ పలువురు మహిళలు, కాలనీ వాసులతో పాటు ఉపాధి కోల్పోతున్న బాధితులు జేసీబీ ( JCB Bulldozers ) యంత్రానికి అడ్డంగా పడుకుని అధికారులను వేడుకున్నారు. దశాబ్దాలుగా చిరు వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలను ఒక్కసారిగా రోడ్డున పడేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఇష్టానుసారంగా కూల్చివేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఉన్నపళంగా బతుకుదెరువును లాక్కుంటే తమ పిల్లలను ఎలా పోషించాలి? తాము బతికేదెట్ల అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులకు న్యాయం చేయాలని, కూల్చివేతలకు ముందు తగిన నోటీసులు ఇచ్చి, చట్టబద్ధమైన విధానాలను పాటించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

