న్యూఢిల్లీ : బీజేపీపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) గురువారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ హిట్లర్ ప్రచార వ్యవస్ధను మరిపిస్తోందని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న వారు కేవలం గోమూత్రాన్నే చూస్తున్నారని ఎద్దేవా చేశారు. వారికి కేవలం ఆరెస్సెస్ కార్యక్రమాలే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రైవేటీకరణ, అసత్యాలను ప్రచారం చేయడం, ముస్లింల పట్ల విద్వేషం, దుందుడుకు జాతీయవాదం ఇవే బీజేపీ అజెండాలో కీలకాంశాలని పవార్ పేర్కొన్నారు.
జర్మనీలో హిట్లర్ ప్రచార వ్యవస్ధ తరహాలో బీజేపీ ఇక్కడ ప్రచార ఎత్తుగడను అనుసరిస్తోందని ఆక్షేపించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, ఫశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిషాలో బీజేపీ అధికారంలో లేదని, దేశంలో బీజేపీకి సానుకూల వాతావరణం లేదని అన్నారు. ఎన్నడూ అమలుకు సాధ్యం కాని గ్యారంటీలను ప్రధాని ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారని ఆరోపించారు.
పవార్ వ్యాఖ్యలను శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సమర్ధించారు. దేశం శాస్త్రీయ దృక్పధంతో ముందుకెళ్లాలని, శరద్ పవార్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. పవార్ ఆలోచనతో విభేదించే వారు దేశాన్ని 5000 ఏండ్లు వెనక్కి తీసుకువెళ్లాలని కోరుకుంటారని విమర్శించారు.
Read More :
Disha Patani | ప్రభాస్ కల్కి 2898 ఏడీలో దిశా పటానీ రోల్ ఇదేనట.. అభిమానులకు పండగే..!