మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 17:36:28

కరోనాను జయించిన శంకర్ సింగ్ వాఘేలా

కరోనాను జయించిన శంకర్ సింగ్ వాఘేలా

అహ్మదాబాద్ : గుజరాత్ రాజకీయాల్లో సీనియర్ నేత శంకర్ సింగ్ వాఘేలా కరోనా వైరస్ ను జయించారు. గత కొన్నిరోజులుగా కరోనా వైరస్ సోకడంతో ఇంటి పట్టునే ఉన్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనాను జయించగలిగానంటున్నారు వాఘేలా.

గుజరాత్ రాజకీయాలలో పార్టీ, ప్రతిపక్షాల రాజకీయాల పరిస్థితి, దిశను నిర్ణయించే శంకర్ సింగ్ వాఘేలా ఒక వ్యక్తి. ఈయనంటే ప్రధాని మోదీకి ఒకప్పుడు ఎంతో గురి ఉండేది. రాజకీయ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. బాపు పేరుతో పిలువబడే వాఘేలా.. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధిపై విజయం సాధించి ఈ సారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. శంకర్ సింగ్ వాఘేలా వయస్సు 80 సంవత్సరాలు. కానీ అతడి అభిరుచి, ఆహార పద్ధతులు మునుపటిలాగానే ఉన్నాయి. ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ వహిస్తాడు. 

ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అతడి రెండు చిత్రాలు నెటిజెన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలలో వాఘేలా జాగింగ్ చేస్తూ.. బరువులు ఎత్తుతూ కనిపిస్తాడు. 80 ఏండ్ల వయస్సులో యువకుడిలా వ్యాయామం చేస్తున్న తీరుపై నెటిజెన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 'తన్ ఫిట్ + మన్‌ ఫిట్ = లైఫ్ హిట్' అని ఆయన ట్విట్టర్‌లో క్యాప్షన్ రాశారు. శంకర్ సింగ్ వాఘేలా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ.. సామాజిక సేవలో తన సమయాన్ని వెచ్చిస్తుండటం విశేషం.


logo