Taxpayer List | స్టార్ సెలబ్రిటీల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర, క్రీడలు ఏ పరిశ్రమలోని వారైనా తమతమ రంగాల్లో రాణిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. దాంతోపాటు ఇతర బిజినెస్‌ల రూపంలోనూ భారీగానే వెనుకేసుకుంటూ రిచ్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. సంపాదనలో నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. అదే సమయంలో ట్యాక్స్ పే విషయంలోనూ మన సెలబ్రిటీలు ముందున్నారు. ఏడాదికి ఏకంగా రూ.కోట్ల రూపంలో ట్యాక్స్ (Taxpayer List) చెల్లిస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా ట్యాక్స్ కట్టిన స్టార్స్ లిస్ట్‌ను ఫార్చ్యూన్ ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. భారతీయ సెలబ్రిటీలందరిలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) అత్యధికంగా పన్ను చెల్లించారు. ఏకంగా రూ.92 కోట్లతో ఆయన తొలి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) ఉన్నారు. ఆయన ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్లు పన్ను రూపంలో చెల్లించారు. ఇక రూ.75 కోట్లతో సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో, రూ.71 కోట్లతో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇక టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ.66 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.
Also Read..
Harish Rao | రాష్టంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన: హరీశ్‌రావు
Jan Dhan Yojana | పదేండ్ల జన్‌ధన్‌తో ఏం ప్రయోజనం?