Encounter | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నారాయణ్‌పూర్ – దంతెవాడ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
బస్తర్ రేంజ్‌లోని (Bastar region) దంతెవాడ, నారాయణ్‌పూర్ (Narayanpur – Dantewada) జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కి ఉన్నట్లు పోలీసులకు ముందుగా సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలను చూసిన మావోలు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది ఎదురుకాల్పులకు దిగి.. 14 మంది మావోలను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది.
#UPDATE | Chhattisgarh: Seven naxals killed in the encounter with Police so far. Bodies of all 7 and a large number of automatic weapons recovered. Encounter still underway. More details awaited.
— ANI (@ANI) October 4, 2024
Also Read..
Ayatollah Ali Khamenei | శత్రువులను ఓడించి తీరుతాం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
Stocks | ఐటీ బ్యాంకింగ్ మినహా ఇండెక్స్‌లన్నీ నష్టాలే.. 25 వేలకు చేరువలో నిఫ్టీ..!