Ayatollah Ali Khamenei | ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ (Iran supreme leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) దేశ ప్రజలనుద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఐదేళ్లలో తొలిసారిగా శుక్రవారం ఉపన్యాసంలో సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదు వద్ద వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై ఇటీవలే ఇరాన్ చేసిన క్షిపణి దాడులను సమర్థించుకున్నారు. తమ శత్రువలను ఓడించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా లెబనాన్, పాలస్తీనాల్లో ( Palestinian) జరుగుతోన్న పోరాటాలకు తాము మద్దతు ఇస్తున్నామని ఖమేనీ పేర్కొన్నారు. లెబనీస్, పాలస్తీనియన్ల ఆక్రమణకు వ్యతిరేకంగా నిలబడిన తమపై అభ్యంతరం, నిరసన తెలిపే హక్కు ఏ అంతర్జాతీయ చట్టానికి లేదని స్పష్టం చేశారు. హమాస్, హెజ్బొల్లాలపై ఇజ్రాయెల్ ఏ విధంగానూ విజయం సాధించలేదన్నారు. ఇక ఇదే సందర్భంలో హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మరణం తమనెంతో బాధించిందన్నారు. ‘సయ్యద్ హసన్ నస్రల్లా ఇప్పుడు మన మధ్య లేరు. కానీ ఆయన సూచించిన మార్గం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన బలిదానం వృథా కాదు. శత్రువుల ప్రణాళికలను తిప్పికొట్టి.. వారిని ఓడించి తీరుతాం. శత్రువులకు వ్యతిరేకంగా మనమందరం ఏకం కావాలి’ అని ఖమేనీ పిలుపునిచ్చారు.
మరోవైపు ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ అంతమొందించింది. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. ఇజ్రాయెల్‌కు ప్రధాన లక్ష్యంగా ఉన్నారు.
Also Read..
Boat accident | ఆర్తనాదాల మధ్య మునిగిపోయిన పడవ.. 78 మంది జలసమాధి.. షాకింగ్ వీడియో
Hyderabad Rains | హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. మరో రెండు గంటల్లో భారీ వాన..!
Amyra Dastur | మెరూన్ డ్రెస్‌లో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న అమైరా దస్తూర్