Hyderabad Rains | హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో ఇవాళ ఉదయం నుంచి ఎండ దంచికొట్టింది. ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం 4 గంటల సమయంలో నగరంలో అక్కడక్కడ వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. చల్లని గాలులు వీస్తూ.. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది.
నగరంలో వర్షం కురియడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. నిన్న, మొన్న నగరంలో పలు చోట్ల వానలు పడిన విషయం తెలిసిందే. టోలిచౌకి, నాంపల్లి, మెహిదీపట్నం, ఎల్బీ నగర్, చైతన్యపురి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, బేగంపేట్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరో రెండు గంటల్లో సౌత్ హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు అని తేలిపోయింది : హరీశ్ రావు
Hyderabad | రేవంత్ రెడ్డిని సంపడానికి అయినా సావడానికి అయినా సిద్ధం.. మూసీ బాధితురాలి ఆవేదన