Hyderabad | కండ్ల ముందే తమ ఇండ్లను నిర్దాక్షిణ్యంతో కూల్చివేస్తుండటంతో మూసీ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. కడుపు మంటతో కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై తమ కోపాన్ని వెల్లగక్కుతున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
35 ఏండ్ల నుండి ఇక్కడ ఉంటున్నాం.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని ఓ మూసీ బాధితురాలు తెలిపింది. రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నాడా అని ప్రశ్నించింది. లక్ష మంది మూసీ బాధితులం జేసీబీలు తీస్కొని రేవంత్ రెడ్డి ఇంటి మీదకు పోతామని వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు ఎంతమంది మీద కేసులు పెడతారని ప్రశ్నించింది. రేవంత్ రెడ్డిని సంపడానికి అయినా సావడానికి అయినా సిద్ధమని స్పష్టం చేసింది.
మాది అక్రమ ఇల్లు అంటే చెప్పు తీసుకొని కొడతామని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ చెత్త మొత్తం పోసే జవహర్ నగర్ చెత్త కుప్పలో మమ్మల్ని ఉండమంటవా అని ప్రశ్నించింది. రూపాయి రూపాయి జమ చేసి కట్టుకొని ఇల్లు వదిలేసి ఆ చెత్త కుప్పలో మేమెందుకు ఉండాలని ప్రశ్నించింది. రేవంత్ రెడ్డినే అక్కడ ఉండమనండని తెలిపింది. ఎవడొచ్చి ఇల్లు కూలుస్తాడో అని నిద్ర పట్టట్లేదని వాపోయింది. రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుంచి దింపేస్తామని స్పష్టం చేసింది.
35 ఏండ్ల నుండి ఇక్కడ ఉంటున్నాం.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది
రేవంత్ రెడ్డి అసలు సీఎం లాగా మాట్లాడుతున్నాడా
లక్ష మంది మూసీ బాధితులం జెసిబిలు తీస్కొని రేవంత్ రెడ్డి ఇంటి మీదకు పోతాం
ఎంత మంది మీద కేసులు పెడతారు.. రేవంత్ రెడ్డిని సంపడానికి అయినా సావడానికి అయినా… pic.twitter.com/ezuOEKEDJC
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2024