Article 370 | జమ్మూ కశ్మీర్‌కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇవాళ ‘ఏకాత్మ మహోత్సవ్’ ర్యాలీని నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సహా ప్రతిపక్ష కూటమి ఆగస్టు 5ను బ్లాక్ డేగా పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు (Security heightened).
#WATCH | Jammu and Kashmir: Security heightened in Srinagar in the wake of the completion of 5 years of the abrogation of Article 370. pic.twitter.com/RBCoONg1wH
— ANI (@ANI) August 5, 2024
మరోవైపు గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రఘటనలు పెరిగిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం కూడా అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది. భద్రతా బలగాలను హై అలర్ట్‌లో ఉంచింది. సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేసింది.
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ- కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత (జమ్మూ-కశ్మీర్, లడఖ్) ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్దమే అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆర్టికల్ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గానీ, శాశ్వతం కాదని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.
Also Read..
Rakul Preet Singh | హైదరాబాద్‌లో ‘ఆరంభం’ పేరుతో మరో బ్రాంచ్‌ను ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్‌సింగ్
KTPS | కేటీపీఎస్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్ల కూల్చివేత