KTPS | కేటీపీఎస్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్ల కూల్చివేత.. వీడియో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి విద్యుత్ వెలుగులను అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కర్మాగారం కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది. ఓఅండ్‌ఎంలోని 8 యూనిట్లకు సంబంధించి ఎనిమిది కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు.
పాల్వంచ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి విద్యుత్ వెలుగులను అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కర్మాగారం కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది. ఓఅండ్‌ఎంలోని 8 యూనిట్లకు సంబంధించి ఎనిమిది కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు. మొదట నాలుగు టవర్లను కూల్చివేసిన అధికారులు తర్వాత మరో నాలుగింటిని తొలగించారు. ఓఅండ్ఎం కర్మాగారం మూతపడటంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించిన విషయం తెలిసిందే. పాత కర్మాగారానికి సంబంధించిన కూల్చివేత, అందులోని మెటీరియల్‌ను తీసుకునే విధంగా ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్ కాంట్రాక్టు కంపెనీ రూ.465 కోట్లకు టెండర్‌ను దక్కించుకొని పనులు పూర్తిచేసింది.

ఇందులో భాగంగా అప్పటి కర్మాగారానికి సంబంధించిన మెటీరియల్ అంతా సంస్థ తీసుకెళ్లింది. మిగిలిన 8 కూలింగ్ టవర్లను సోమవారం ఉదయం 8 గంటలకు కూల్చివేసింది. వారంక్రితమే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో వాయిదా వేశారు. కాగా, టవర్ల కూల్చివేత సమయంలో ప్లాంట్‌నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో రెండుగంటలపాటు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

