Rakul Preet Singh | టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి సూపర్ బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత తారక్, రాంచరణ్, మహేశ్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఈ భామ ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇక సినిమాల్లో రాణిస్తూనే పలు బిజినెస్‌లను కూడా రకుల్ సక్సస్‌ఫుల్‌గా లీడ్ చేస్తోంది.
ఇప్పటికే రకుల్ ఫిట్నెస్ వ్యాపారంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ (Hyderabad), వైజాగ్‌లలో F-45 పేరుతో జిమ్‌లను ఏర్పాటు చేసింది. దీనికి తోడు ఇటీవలే ఫుడ్ బిజినెస్‌లోకి కూడా రకుల్ ఎంట్రీ ఇచ్చింది. ‘ఆరంభం’ (Arambam Start With Millets) పేరుతో ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓ వెజ్ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని కావూరీ హిల్స్ ప్రాంతంలో తన మొదటి బ్రాంచ్‌ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా రెండో బ్రాంచ్‌ను హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను నటి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేసింది. ‘కొండాపూర్ (Kondapur)లోని మా రెండో అవుట్లెట్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మిల్లెట్స్‌తో మీ రోజును ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారా..?’ అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. ఈ డైన్ఇన్ రెస్టారెంట్లో మిల్లెట్స్‌తో చేసిన వంటకాలు లభించనున్నాయి.
ఇక రకుల్ రీసెంట్గా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీభగ్నానీ (బాయ్ ఫ్రెండ్)తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిందని తెలిసిందే. ఈ ఇద్దరూ గోవాలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌తో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే.. ఓ పక్క సినిమాలు, మరోపక్క బిజినెస్‌లలోనూ రాణిస్తోంది.
Also Read..
Vishwambhara | విజువల్ వండర్‌గా విశ్వంభర క్లైమాక్స్
Thangalaan | చారిత్రక ఘటనకు తెరరూపం తంగలాన్
Double ismart | ఇస్మార్ట్ శంకర్‌కి ఇది అప్డేట్ వెర్షన్