Double ismart | ‘ఇస్మార్ట్ శంకర్’ మెంటల్ మ్యాడ్నెస్ కేరక్టర్. ‘డబుల్ ఇస్మార్ట్’ వాడికి అప్డేట్ వర్షెన్. పూరీ ఎక్కువ టైమ్ తీసుకొని రాసిన కథ ఇది. కమర్షియల్ సినిమా ఇచ్చే అసలైన కిక్కును ఈ సినిమా రుచి చూపిస్తుంది. అది రేపు థియేటర్లలో చూస్తారు.’ హీరో రామ్ పోతినేని అన్నారు. ఆయన హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీజగన్నాథ్, ఛార్మీ కౌర్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.
ఈ సందర్భంగా వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ మాట్లాడారు. సి సెంటర్స్‌లో విజిల్స్ వేస్తూ చూడాల్సిన సినిమా ఇదని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని, ముంబైలో ఫైనల్ మిక్సింగ్‌లో ఉండి ఈవెంట్‌కి రాలేకపోయానని దర్శకుడు పూరీజగన్నాథ్ లైవ్ వీడియోలో చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.