Thangalaan | ‘వందేళ్ల క్రితం జరిగిన కథ ‘తంగలాన్’. ఇదొక అడ్వంచరస్ మూవీ. పా రంజిత్ తన ఆర్ట్ ఫామ్లో అందంగా తెరకెక్కించాడు. తను నా డ్రీమ్ డైరెక్టర్. ఇన్నాళ్లకు తనతో పనిచేసే అవకాశం కుదిరింది. ఇందులో రివీల్ చేయని సర్ప్రైజ్లు చాలా ఉన్నాయి. అవేంటో రేపు థియేటర్లో చూస్తారు.’ అని చియాన్ విక్రమ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ కథానాయికలు. పా రంజిత్ దర్శకుడు.
కేఈ జ్ఞానవేల్రాజా నిర్మాత. ఈ నెల 15న సినిమా విడుదలకానుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడారు. అణచివేత, అసమానత్వాన్ని ఎదుర్కొనేందుకే తాను సినిమా మాధ్యమాన్ని ఎంచుకున్నానని, స్వాతంత్య్రానికి పూర్వం జరిగి ఓ చారిత్రక ఘటనకు తెరరూపమే ‘తంగలాన్’ అని, ఇది స్వేచ్ఛా స్వాతంత్య్రాలకోసం జరిగే పోరాటమని, పాత్రని అర్థం చేసుకొని నటించే విక్రమ్ లాంటి నటుడు దొరకడం తమ అదృష్టమని దర్శకుడు పా రంజిత్ తెలిపారు.