Vishwambhara | అగ్రనటుడు చిరంజీవి నటిస్తున్న సోషియోఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఓ వైపు ప్రొడక్షన్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ క్లైమాక్స్‌కు చేరుకుంది. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఈ క్లైమాక్స్‌ని దర్శకుడు వశిష్ఠ ప్లాన్ చేశారు. ఈ క్లైమాక్స్ విజువల్ వండర్‌గా వుండబోతున్నదని, ఈ సీక్వెన్స్‌లో ఫాంటసీ ఎలిమెంట్స్ హైలైట్ కానున్నాయని వశిష్ఠ తెలిపారు.
ఇండియన్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆన్ల్ అరుసు నేతృత్వంలో ఈ క్లైమాక్స్‌ని తెరకెక్కించనున్నామని, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానున్నదని మేకర్స్ తెలిపారు. త్రిష, అషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కునాల్కపూర్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్, నిర్మాణం: యూవీ క్రియేషన్స్.
వయనాడ్ బాధితులకు కోటి విరాళం: విపత్తులు ఎదురైనప్పుడు ప్రజలకోసం నిలబడే కొద్దిమంది ప్రముఖుల్లో చిరంజీవి ఒకరు. కేరళ వయనాడ్ బాధితుల కోసం చిరంజీవి ముందుకొచ్చారు. తన పెద్ద మనసును చాటుకుంటూ తన కుమారుడు రామ్‌చరణ్‌తో కలిసి కోటి రూపాయిలు విరాళంగా ప్రకటించారు. త్వరలో ఆ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి అందజేస్తామని వారు తెలిపారు.