Amit Rohidas | సెమీస్‌కు ముందు భారత హాకీ జట్టుకు ఎదురుదెబ్బ.. డిఫెండర్ రోహిదాస్‌పై ఒక మ్యాచ్ నిషేధం
పారిస్ ఒలింపిక్స్‌లో పతకానికి అడుగు దూరంలో ఉన్న భారత హాకీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిఫెంటర్ అమిత్ రోహిదాస్ (Amit Rohidas) ఒక మ్యాచ్ నిషేధానికి గురైయ్యాడు. ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పతకానికి అడుగు దూరంలో ఉన్న భారత హాకీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిఫెంటర్ అమిత్ రోహిదాస్ (Amit Rohidas) ఒక మ్యాచ్ నిషేధానికి గురైయ్యాడు. ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్‌దాస్ హాకీ ఫెడరేషన్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘించాడని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH) వెల్లడించింది. దీంతో అతడిని ఒక మ్యాచ్ సస్పెండ్ చేస్తున్నట్లు ఎఫ్ఐహెచ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో మంగళవారం జర్మనీతో జరుగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీనికి సంబంధించి పారిస్ ఒలింపిక్స్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆదివారం నాటి మ్యాచ్ రెండో క్వార్టర్ మొదలైన రెండు నిమిషాలకే భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు రిఫరీ రెడ్ కార్డ్ చూపించాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడైన విలియమ్ కల్నల్ తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని ఆరోపిస్తూ రిఫరీలు అతడిని బయటకు పంపించాడు. దీంతో హర్మన్‌ప్రీత్ సేన మిగిలిన మ్యాచ్‌ను 10 మందితోనే ఆడింది. కీలక ఆటగాడు ఫీల్డ్‌లో లేకున్నా భారత్ నిరాశచెందలేదు. మూడో క్వార్టర్లో సుమిత్ కూడా గ్రీన్ కార్డ్ కారణంగా కొంతసేపు మైదానాన్ని వీడటం గమనార్హం. 22వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్ బోణీ కొట్టింది. అయితే రెండో క్వార్టర్ ముగియకుమందే 27వ నిమిషంలో లీ మోర్టన్ గోల్‌తో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. తర్వాత రెండు క్వార్టర్స్‌లోనూ ఇరు జట్లూ గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది.
షూటౌట్ సాగిందిలా..
షూటౌట్లో బ్రిటన్ తరఫున అల్బరి జేమ్స్, వాలేస్ జాక్ రెండు గోల్స్ కొట్టారు. భారత్ నుంచి హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ గోల్స్ చేసి స్కోర్లను సమం చేశారు. మూడో గోల్ కోసం వచ్చిన విలియమ్సన్ కానర్ ప్రయత్నాన్ని శ్రీజేష్ అడ్డుకోవడంతో ఆ జట్టులో టెన్షన్ మొదలైంది. లలిత్ ఉపాధ్యాయ మూడో గోల్ చేసి భారత్‌ను 3-2తో ఆధిక్యంలోకి తెచ్చాడు. బ్రిటన్‌కు చివరి అవకాశంగా వచ్చిన రోపర్ ఫిలిప్ సైతం గోల్ చేయడంలో విఫలమయ్యాడు. కానీ రాజ్‌కుమార్ పాల్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- amit rohidas
- ban
- fih
- Great Britain
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

