Encounter | మంగళవారం మధ్యాహ్నం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్గామ్ (Pahalgam)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత కశ్మీర్ లోయలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంలో భద్రతా బలగాలు మోహరించారు. జమ్ము ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం అక్కడ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది.
ఉదమ్పూర్ జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. బేస్ క్యాంపుల నుంచి పెద్ద ఎత్తున భద్రతా బలగాలను ఆ ప్రాంతంలోకి తరలిస్తున్నారు.
Also Read..
Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి.. పాక్ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు
Bharat Bhushan | పిల్లాడిని కిందకు దింపమని చెప్పి.. మూడు నిమిషాలపాటు కాల్చారు!
Kashmir | పహల్గాం దాడికి నిరసన.. 35 ఏండ్లలో తొలిసారిగా కశ్మీర్ లోయ షట్డౌన్