Heavy Rains | గత కొన్ని రోజులుగా కేరళ (Kerala), తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains ) ముంచెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి.
తమిళనాడులోని చెన్నై, తూత్తుకుడి, నీలగిరి, తిరుచ్చిరపల్లి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తెన్కాసి, పుదుకోట్టై, విరుదునగర్, తేని సహా పలు జిల్లాల్లో బుధవారం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం పడుతోంది. దీంతో ఆయా జిల్లాల యంత్రాంగం విద్యా సంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించింది. ఇక చెన్నైలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ నీటమునిగాయి. దీంతో ఓ సబ్వేలో బస్సు చిక్కుకుపోయింది. పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది.
కేరళలోనూ భారీ వర్షం కురుస్తోంది. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రానున్న రోజుల్లో పతనంతిట్టతోపాటు మరో రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీ వర్షం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల వెళ్లే రహదారిపై కొండచరిలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
#WATCH | Tamil Nadu: Rainwater entered the houses in the residential areas of the Nilgiris district after heavy rainfall in the region. pic.twitter.com/si1UZmCRsl
— ANI (@ANI) November 23, 2023
#WATCH | Tamil Nadu: Heavy rain lashes parts of Tiruchirappalli. pic.twitter.com/0UBFBeUSaV
— ANI (@ANI) November 23, 2023
#WATCH | Tamil Nadu: Waterlogging in several parts of Thoothukudi after heavy rainfall in the region. pic.twitter.com/2EfbVFyY2l
— ANI (@ANI) November 23, 2023
#WATCH | Rain lashed several parts of Tamil Nadu’s Thoothukudi (22/11) pic.twitter.com/tx14aFrWeD
— ANI (@ANI) November 23, 2023
#WATCH | Tamil Nadu: Rain lashes parts of the Nilgiris district.
(Visuals from Ooty City) pic.twitter.com/kOkQ2uMYxH
— ANI (@ANI) November 23, 2023
#WATCH | Kerala: Waterlogging in the low-lying residential areas of Thiruvananthapuram district after heavy rainfall in the region. pic.twitter.com/cTRZwom6Qb
— ANI (@ANI) November 23, 2023
Also Read..
Rain | హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం
Etamatam | కిషన్జీ.. అమావాస్య, పున్నాలు చూసుకుంటే ప్రచారం ఎప్పుడు మొదలుపెడతారు!