కొల్లాపూర్ : తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ( KCR ) , బీఆర్ఎస్( BRS) అధికారంలోకి ప్రజలు బలంగా కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి( Beeram Harsavardan Reddy ) అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మున్సిపాలిటీ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. ప్రజలతో, సంతలో చిరు వ్యాపారాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి బాగోగుల గురించి ఆరా తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ పరిస్థితి బాగాలేదని, వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని వివరించారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాత్రమే కొల్లాపూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.
ముఖ్యంగా మున్సిపాలిటీలో 24 గంటల విద్యుత్, ప్రతిరోజు సురక్షితమైన మంచినీరు అందించామని గుర్తు చేశారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం నాలుగో వార్డులో పార్కును అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా కుంటు పడిపోయిందన్నారు. గతంలో మున్సిపాలిటీ అభివృద్ధిని అడ్డుకున్న వారే నేడు అధికారంలో ఉండడంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపించారు