Free Air Scheme | వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఉచిత గాలి పథకం.. కాషాయ పార్టీపై ఫన్టాస్టిక్ పంచ్
Free Air Scheme | ‘ధర చెల్లించి గాలి పీల్చడానికి జనం అలవాటు పడతారు. అప్పుడు ఎన్నికల్లో ఉచిత గాలి పథకం ప్రవేశ పెడతాం. ఇదొక్కటే కాదు దేవుడిని ఉచితంగా మొక్కవచ్చు. అయోధ్య రామాలయాన్ని ఉచితంగా సందర్శించవచ్చు... అని ఎన్నికల ఉచిత ప్రకటనలు చేస్తాం. ఓట్లే ఓట్లు...’
Free Air Scheme | మోడీ షాలు ఆలోచనల్లో పడిపోయారు. అదానీకి ఏమీ కాదు ఎందుకు దిగులు అని అక్కడున్న వాళ్లు వీళ్లకి వినిపించేట్టుగానే అన్నారు. మీరిద్దరూ అదానీ వెనుక, ముందు ఉన్న తరువాత ఏమవుతుంది అని అనునయించారు.
‘మా దిగులు అది కాదు. ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు. తెలంగాణలో పాత రికార్డులు బద్దలు కొట్టేట్టుగా ఉన్నాం.’
‘అంటే గెలుస్తామా?’
‘ఏ లోకంలో ఉన్నావయ్యా? రికార్డులు బద్దలు కొట్టడం అంటే గత ఎన్నికల్లో తెలంగాణలో 105 చోట్ల డిపాజిట్లు పోయాయి. ఈ సారి మన రికార్డును మనమే బద్దలు కొడతామేమో అనిపిస్తున్నది.
‘జనాలను ఆకట్టుకునే విధంగా కొత్త హామీలు ఏమిద్దామా? అని ఆలోచిస్తున్నాం. మీకూ ఏమైనా తడితే చెప్పండి…’ అని షా అడిగారు.
‘బొందితో స్వర్గానికి…అంటే ఎలా ఉంటుంది?’
‘కరెన్సీ రద్దు సమయంలో జనాలకు బతికి ఉండగానే నరకం చూపించి, 50 రోజులు ఓపిక పడితే స్వర్గం చూస్తారు అని హామీ ఇచ్చాం. ఈ దెబ్బకు తిరుగులేదు… మననే గెలిపిస్తారు… అంటూ ఉత్సాహంగా షాను కౌగిలించుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనం గిలగిలా కొట్టుకునేట్టు చేస్తున్నాం.
‘మీ మనసులో ఏముందో నాకు తెలుసు. గిలగిలా కొట్టుకోవడమే కాదు, మనం తప్ప మరో మార్గం లేదని ఒప్పుకుంటారు. అలాంటి హామీ’ అని చెప్పుకొచ్చారు.
ఏమిటో ఆ హామీ…
‘మనిషి రేషన్ బియ్యం, పెన్షన్, రైతుబంధు, కల్యాణలక్ష్మి ఇవేవీ లేక పోయినా బతుకుతాడు’ అని మోదీ చెబితే.. అంతా ఔను అన్నారు.
‘కానీ, గాలి లేనిదే మనిషి బతకడు. మనం కొలువైన ఢిల్లీలో కాలుష్యం చూశాక నాకో ఐడియా వచ్చింది. గాలి కోసం ప్రజలు ఎంతగా తపిస్తారో ఇక్కడ చూశాం’
‘అంటే కాలుష్యం నివారణకు చర్యలు తీసుకుంటారా?’
‘నో… మనం ప్రతి సమస్యను అవకాశంగా చూడాలి. అలానే కాలుష్యం సమస్యను కూడా …’ గాలి లేనిదే బతక లేరు. గాలికి రేషన్ విధిస్తాం.
‘దీని వల్ల నష్టమే కానీ లాభం ఏముంది?’
‘ముందు రేషన్ విధిస్తాం, తర్వాత ధర నిర్ణయిస్తాం. అంటే ఇప్పటిలా ఇష్టం వచ్చినట్టు గాలి పీల్చడానికి వీలు లేదు. ధర చెల్లించి గాలి పీల్చాలి.’
‘అలా చేస్తే ఎలా గెలుస్తాం?’
‘ధర చెల్లించి గాలి పీల్చడానికి జనం అలవాటు పడతారు. అప్పుడు ఎన్నికల్లో ఉచిత గాలి పథకం ప్రవేశ పెడతాం. ఇదొక్కటే కాదు దేవుడిని ఉచితంగా మొక్కవచ్చు. అయోధ్య రామాలయాన్ని ఉచితంగా సందర్శించవచ్చు… అని ఎన్నికల ఉచిత ప్రకటనలు చేస్తాం. ఓట్లే ఓట్లు…’
‘అంటే, ఇప్పుడు తిరుపతి లడ్డూల మీద విధించిన జీఎస్టీ తీసేస్తారా?’
‘బాబూ… ఒకసారి జీఎస్టీ విధించాక తీసేయడం కుదరదు.
****
గాలికి డబ్బులు వసూలు చేయాలి, అనే ఐడియా అదిరిందంటూ అంతా చప్పట్లు కొట్టి అభినందించారు. ఉచిత గాలి హామీల ప్రకటన టీవీలో విని ఓటరు మంచం పై నుంచి కింద పడ్డాడు. వామ్మో వీళ్ళు వస్తే ఇంకేమైనా ఉందా!? ఊపిరి ఆగిపోతుంది అని భయపడ్డాడు.
– మురళి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

