Chandrayaan-3 | చంద్రయాన్ మిషన్‌కు ఆల్‌ది బెస్ట్.. ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్ పట్నాయక్
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే ఈరోజు సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి (Sand artist) సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik).. పూరీ సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు. చంద్రయాన్ మిషన్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతూ.. జాబిల్లి, త్రివర్ణ పతాకం, రాకెట్ చిత్రాలతో కూడిన ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించారు.
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే ఈరోజు సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్‌కు (Safe landing) ఇస్రో సర్వం సిద్ధంచేసింది. దీనికోసం యావత్ భారతమేకాదు ప్రపంచ దేశాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి (Sand artist) సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik).. పూరీ సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు. చంద్రయాన్ మిషన్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతూ.. జాబిల్లి, త్రివర్ణ పతాకం, రాకెట్ చిత్రాలతో కూడిన ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
#WATCH | Team of Sand artist Sudarsan Pattnaik extends best wishes ahead of the landing of the Chandrayaan-3 Mission on August 23. pic.twitter.com/L72Gzb0oX3
— ANI (@ANI) August 22, 2023
మరోవైపు విక్రమ్ ల్యాండర్ (Vikram lander) మరికొన్ని గంటల్లోనే చంద్రుడిపై అడుగుపెట్టబోతోంది. ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై కాలు మోపనుంది. అంతా సవ్యంగా సాగితే చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేపట్టిన నాలుగో దేశంగా భారత్ నిలువనుంది. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ప్రయోగం విజయవంతమై అంతరిక్ష యవనికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని యావత్ భారతావని ప్రార్థిస్తోంది. రష్యా ప్రయోగించిన లూనా-25 మిషన్ నాలుగు రోజుల క్రితం చివరి దశలో కుప్పకూలడంతో ఇప్పుడు అందరి కండ్లూ చంద్రయాన్‌పై నిలిచాయి. సాఫ్ట్‌ల్యాండింగ్ కార్యక్రమాన్ని ఇస్రో, టీశాట్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం ఈరోజు సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభం కానుంది. ఒక వేళ ప్రతికూల పరిస్థితులు తలెత్తితే సాఫ్ట్‌ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27కు వాయిదా వేయనున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ALL THE BEST 🇮🇳 #Chandrayan3
My students created a sand art on #Chandrayaan 3 with the message "Jai Ho @isro , at Puri beach in Odisha. pic.twitter.com/SDbL8kpbEt— Sudarsan Pattnaik (@sudarsansand) August 22, 2023
ఆ 20 నిమిషాలు..
ల్యాండింగ్‌కు ముందు మాడ్యూల్‌లోని అన్ని పారామీటర్లను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత నిర్దేశించుకొన్న ప్రాంతంలోచంద్రుడిపై సూర్యోదయం వరకు ఎదురుచూస్తారు. ల్యాండింగ్ ప్రక్రియ సరిగ్గా సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభమై 6.04 గంటలకు ముగుస్తుందని అంచనా. దీనినే ‘20 నిమిషాల టెర్రర్’గా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్ మాడ్యూల్ సరైన ఎత్తులో, సరైన సమయంలో సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని తనకు తానుగానే ఇంజిన్లను మండించుకోవాల్సి ఉంటుంది. ఎత్తుపల్లాలు లేని ఉపరితలంపై దిగే ప్రాంతాన్ని కూడా కెమెరాతో స్కాన్ చేసుకొని దిగుతుంది. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రతి అడుగు కీలకమే. చంద్రుని ఆకర్షణశక్తికి అనుగుణంగా ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకుంటూ వేగాన్ని తగ్గించుకుంటుంది. ఆ తరువాత 11 నిమిషాలపాటు రన్ బ్రేకింగ్ దశ మొదలవుతుంది. ఈ దశలో ల్యాండర్ చంద్రునికి సమాంతరంగా నిలుస్తుంది. క్రమంగా ఫైన్ బ్రేకింగ్ దశలోకి వస్తుంది. దిగేందుకు అనువుగా ల్యాండర్ 90 డిగ్రీల వంపు తిరుగుతుంది. క్రితంసారి చంద్రయాన్-2 ఈ దశలోనే కూలిపోయింది. ఈ దశల అనంతరం ల్యాండర్ చంద్రునికి కేవలం 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అప్పుడు దాని వేగం సున్నాకు చేరుతుంది. అలా మెల్లిగా 150 మీటర్ల ఎత్తుకు చేరగానే దిగేందుకు సరైన ప్రదేశం కోసం ల్యాండర్ వెతుకుతుంది. అనువైన స్థలం దొరకకగానే అక్కడ సెకనుకు మూడు మీటర్ల వేగంతో చంద్రుని ఉపరితలాన్ని తాకుతుంది. ఈ విధంగా చివరి 20 నిమిషాల ఉత్కంఠకు తెరపడి మిషన్ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత 14 రోజుల పాటు మామ ఇంట గడుపుతుంది.
సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ సాగుతుంది ఇలా..
- ల్యాండర్ మాడ్యూల్లో అన్ని పారామీటర్లు తనిఖీ చేసి, ల్యాండింగ్ ప్రాంతాన్ని నిర్దేశించుకొన్న తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు సంబంధింత కమాండ్లను షెడ్యూల్ ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు ల్యాండర్ మాడ్యూల్‌కు అప్లోడ్ చేస్తారు.
- ల్యాండింగ్ కోసం చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశలోకి అడుగు పెడుతుంది. రెట్రో ఫైరింగ్ ద్వారా తన 4 థ్రస్టర్ ఇంజిన్లను మండించుకొంటుంది. అనంతరం చంద్రుడి గురుత్వాకర్షణకు అనుగుణంగా వేగాన్ని తగ్గించుకొంటుంది.
- జాబిల్లి ఉపరితలానికి 6.8 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొన్న తర్వాత రెండు ఇంజిన్లను ఆఫ్ చేసి, మిగిలిన రెండింటిని మాత్రమే వినియోగించుకొంటుంది. రివర్స్ థ్రస్ట్‌తో ల్యాండర్ మాడ్యూల్ మరింత కిందకు వస్తుంది.
- చంద్రుడి ఉపరితలానికి 150-100 మీటర్ల ఎత్తుకు వచ్చిన తర్వాత ల్యాండర్ తన సెన్సార్లు, కెమెరాలను వినియోగించుకొని సాఫ్ట్ ల్యాండింగ్ కోసం బండరాళ్లు, ఎగుడుదిగుడు లేని ప్రాంతం కోసం వెతుకుతుంది.
ల్యాండింగ్ ప్రారంభ ప్రక్రియలో ల్యాండర్ వేగం సెకనుకు 1.68 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ వేగం వద్ద ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి సమాంతరంగా ఉంటుంది. ఇక్కడ 90 డిగ్రీలు వంపు తిరిగి ఉపరితలానికి నిలువుగా వస్తుంది. ఇది క్లిష్టమైన ప్రక్రియ. ఈ దశలోనే చంద్రయాన్-2 విఫలమైంది.
Also Read..
Serena Williams | రెండోసారి తల్లైన సెరెనా విలియమ్స్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి
Cable Car | కేబుల్ కారులో చిక్కుకుపోయిన చిన్నారులు.. 15 గంటలు శ్రమించి రక్షించిన అధికారులు
Vennela Kishore | హీరోగా వెన్నెల కిషోర్.. గ్లింప్స్ మాములు హిలేరియస్‌గా లేదుగా..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

