Serena Williams | అమెరికాకు చెందిన టెన్నిస్ దిగ్గజం (tennis star) సెరెనా విలియమ్స్ (Serena Williams) రెండో సారి తల్లైంది. ఈ సారి కూడా ఆమె ఆడబిడ్డకే జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అలెక్సిస్ ఒహానియన్ (Alexis Ohanian) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఫొటోలు పంచుకున్నారు. పాపకు అధీరా రివర్ ఒహానియా (Adira River Ohanian) అని పేరు కూడా పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇప్పుడు ఇల్లంతా ఆనందంతో నిండిపోయినట్లు చెప్పారు. తనకు మరో అద్భుతమైన బహుమతి ఇచ్చావని.. గ్రేటెస్ట్ మదర్ ఆఫ్ ఆల్టైమ్ అంటూ భార్యపై అలెక్సిస్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కాగా, సెరెనా-అలెక్సిస్కు ఇప్పటికే ఓ పాప ఉన్న విషయం తెలిసిందే. ఆరేళ్ల క్రితం సెరెనా ఓ అమ్మాయికి జన్మనిచ్చింది.
Also Read..
Cable Car | కేబుల్ కారులో చిక్కుకుపోయిన చిన్నారులు.. 15 గంటలు శ్రమించి రక్షించిన అధికారులు
Joe Biden | భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు.. 4 రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్న బైడెన్