Loksabha Elections 2024 | ఓట్ల కోసం దేశ భద్రతలోనూ విపక్ష కూటమి రాజీ : విజయ్ సిన్హా
Loksabha Elections 2024 | ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటనపై బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా భగ్గుమన్నారు.
Loksabha Elections 2024 | ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటనపై బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా భగ్గుమన్నారు. లాలూ ప్రసాద్ బిహార్‌కు శాపంలా పరిణమించారని విరుచుకుపడ్డారు. ఎన్నికల గురించి లాలూ భయపడుతున్నారని, ఓట్ల కోసం ఆయన సంతుష్ట రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. వారు ఎన్నడూ హిందూ ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల గురించి మాట్లాడారని అన్నారు.
తమ ఓటు బ్యాంక్ కోసం వారు ఏ ఒప్పందమైనా చేసుకుంటారని చెప్పారు. రిజర్వేషన్ అనేది చాలా చిన్న విషయం అయితే వారు రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతతో కూడా రాజీపడతారని విమర్శించారు. ఈ ఆలోచనతో ఉన్న వారితో అరాచకానికి దారి తీస్తుందని, ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్ సిద్ధహస్తుడని విజయ్ సిన్హా పేర్కొన్నారు.
ఇక ముస్లింల రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలో కోత విధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ సహా కాషాయ నేతలు ఎన్నికల సభల్లో ఊదరగొడుతుంటే మోదీ మూడోసారి ప్రధాని అయితే ఏకంగా రిజర్వేషన్లనే రద్దు చేస్తారని కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారం చేస్తున్నారు.
Read More :
Virus in Mobiles | షావోమీ, రెడ్మీ, పోకో ఫోన్లలో ప్రమాదకర వైరస్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

