Vennela Kishore | హీరోగా వెన్నెల కిషోర్.. గ్లింప్స్ మాములు హిలేరియస్‌గా లేదుగా..!
Chaari111 Movie | చారీ777 అంటూ స్పై కామెడీ సినిమాతో అలరించాడనికి రెడీ అయ్యాడు వెన్నెల కిషోర్. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. ప్రతినాయకుడి వలన ప్రమాదంలో పడిపోయిన సిటీని కాపాడటానికి వచ్చిన వీరుడిగా(జోకర్) సినిమా థీమ్‌ను గ్లింప్స్‌లో చెప్పారు.
Chaari111 Movie | గత పుష్కర కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా ఏకచక్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు వెన్నెల కిషోర్. బ్రహ్మనందం తర్వాత ఆ స్థాయి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. తెరపై వెన్నెల కిషోర్ కనిపించాడంటే చాలు.. నవ్వు దానంతట అదే వస్తుంది. అంతలా తన కామెడితో చేరువయ్యాడు. లెక్కలేనన్ని సినిమాలు కేవలం వెన్నెల కిషోర్ కామెడీతో నిలబడ్డాయనడంలో అతిశయోక్తి లేదు. కేవలం కమెడియన్‌గానే కాకుండా ఈ మధ్య నెగెటీవ్ పాత్రలతోనూ మెప్పిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ నటుడు హీరో అవతారమెత్తాడు.
చారీ777 అంటూ స్పై కామెడీ సినిమాతో అలరించాడనికి రెడీ అయ్యాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. ప్రతినాయకుడి వలన ప్రమాదంలో పడిపోయిన సిటీని కాపాడటానికి వచ్చిన వీరుడిగా(జోకర్) సినిమా థీమ్‌ను గ్లింప్స్‌లో చెప్పారు. సత్య వాయిస్ ఓవర్ టీజర్‌ను మరింత హ్యాస్యాస్పదంగా చేసింది. సీరియస్ సబ్జెక్ట్‌ను సిల్లీగా చెప్పడానికి వెన్నెల కిషోర్ అండ్ టీమ్ రెడీ అవుతుంది. పది నిమిషాలు వెన్నెల కిషోర్ స్క్రీన్‌పైన కనిపిస్తేనే నవ్వి నవ్వి సచ్చిపోతుంటాం. అలాంటిది రెండు గంటల పాటు ఉంటే ఇంకా ఏ రేంజ్లో నవ్వులు పూయిస్తాడో ఊహించడం కష్టమే.
ఈ కామెడీ సినిమాకు టీజీ కీర్తికుమార్ దర్శకుడు. మురళిశర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చెన్నై సొగసరి సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటిస్తుంది. సిమన్ కే కింగ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బర్కత్ స్టూడియెస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

