Saif Ali Khan : మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లోని బాంద్రా (Bandra) ఏరియాలోగల తన నివాసంలో ఓ దొంగ చేతిలో కత్తిపోట్లకు గురైన నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. గురువారం రాత్రి పోలీసులు ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. తనపై ఏవిధంగా దాడి జరిగిందో వరుస క్రమంలో సైఫ్ అలీఖాన్ పోలీసులకు వివరించాడు.
నిందితుడిని గట్టిగా పట్టుకున్నానని, దాంతో అతడు పదేపదే వీపుపై కత్తితో దాడి చేశాడని, అందుకే అతడిని విడిచిపెట్టానని సైఫ్ అలీఖాన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది. ‘నేను కరీనా మా గదిలో ఉన్నాం. ఒక్కసారిగా మా చిన్న కుమారుడు జెహ్ ఏడుపు వినిపించింది. దాంతో బయటకు వచ్చి చూస్తే అక్కడ ఓ దుండగుడు స్టాఫ్ నర్సుపై దాడి చేస్తున్నాడు. నేను అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించా. వెంటనే అతడు నా వీపు, మెడ, చేతులపై కత్తితో దాడి చేశాడు. తెల్లవారుజామున 2.30 నుంచి 2.40 గంటల మధ్య ఈ ఘటన జరిగింది’ అని పోలీసులకు సైఫ్చెప్పారు.
ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి సైఫ్ భార్య, నటి కరీనాకపూర్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. మరోవైపు కత్తిదాడి నేపథ్యంలో బాంద్రాలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు రెండు షిఫ్టుల్లో భద్రతా విధులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా జనవరి 16న సైఫ్‌పై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సైఫ్ వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. చికిత్స అనంతరం ఆయన మంగళవారం డిశ్చార్జి అయ్యారు.
ఈ కేసులో ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. మహ్మద్ షరీఫుల్ ఏడు నెలల క్రితమే మేఘాలయలోని డౌకీ నది దాటి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు. అతడు భారత్‌లో విజయ్దాసుగా పేరు మార్చుకున్నట్లు తెలిపారు.
Saif Ali Khan case | సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. నిందితుడి పోలీస్ కస్టడీ పొడిగింపు
Crime news | రాత్రంతా పరిచయస్తుడితో బయటికి.. తెల్లారి ఇంట్లో వాళ్లు తిడతారని..!
Crime news | అమానవీయం.. అప్పు చెల్లించలేదని మహిళను తీవ్రంగా కొట్టి.. గుండు గీసి..!
Virender Sehwag: విడాకులు తీసుకునే ఆలోచనలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ !
Earthquake | ఉత్తరకాశీని వణికించిన భూకంపం
Kamala Harris | భర్త వల్లే ఓడిపోయిందా.. కమల హారిస్ దంపతుల విడాకులు?