Safest Cities : నంబియో సేఫ్టీ ఇండెక్స్ (Numbeo Safety Index) ప్రపంచవ్యాప్తం (Worldwide) గా ఉన్న సురక్షిత నగరాలు, దేశాలు-2025 జాబితాను విడుదల చేసింది. అందులో భారత్ (India) కు చెందిన 10 నగరాలు కూడా ఉన్నాయి. భారతదేశానికి చెందిన సురక్షిత నగరాల్లో కర్ణాటక (Karnataka) లోని మంగళూరు (Mangalore) తొలి స్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) అట్టడుగున ఉంది.
గుజరాత్‌లోని వడోదర, అహ్మదాబాద్, సూరత్ నగరాలకు కూడా టాప్-10 ఈ జాబితాలో స్థానం దక్కింది. కానీ హైదరాబాద్ నగరానికి టాప్-10 జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. ఇక ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో భారత్ 67వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత్ 55.8 స్కోర్‌ను సాధించింది. దేశంలో టాప్-10 నగరాలు వరుసగా మంగళూరు, వడోదర, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, నవీ ముంబై, తిరువనంతపురం, చెన్నై, పుణె, చండీగఢ్ ఉన్నాయి.