Sabarimala | కేరళ (Kerala)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల (Sabarimala Temple)కు భక్తులు (Devotees) పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్లో తొలి 15 రోజుల్లోనే ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది (Sabarimala revenue soars). గతేడాదితో పోలిస్తే 33 శాతం పెరిగింది.
మండల- మకరవిళక్కు వేడుకలు ప్రారంభమైన 17వ తేదీ నుంచి ఈనెల 1వ తేదీ అంటే తొలి 15 రోజుల్లో రూ.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తాజాగా వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్లో రూ.69 కోట్లు వసూలైనట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల ద్వారానే అధిక ఆదాయం వచ్చినట్లు టీడీబీ తెలిపింది. దాదాపు రూ.47 కోట్లు సమకూరినట్లు వివరించింది.
గతేడాదితో పోలిస్తే ప్రసాదం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం 46.86 శాతం ఎక్కువ అని పేర్కొంది. గత సీజన్లో తొలి 15 రోజుల్లో కేవలం రూ.32 కోట్లు మాత్రమే సమకూరినట్లు టీడీబీ వెల్లడించింది. హుండీ ఆదాయం గత సంవత్సరంతో పోల్చుకుంటే 18.18 శాతం పెరిగిందని స్పష్టం చేసింది. నవంబర్ 30 వరకూ దాదాపు 13 లక్షల మంది భక్తులు శబరిమలను సందర్శించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.
Also Read..
Karnataka | కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు.. డీకే నివాసానికి సీఎం సిద్ధరామయ్య
Akhil | అడ్రెస్ లేని అఖిల్ లెనిన్.. పాపం అక్కినేని హీరోకే ఎందుకిలా?