Karnataka | కర్ణాటకలో నాయకత్వ (Karnataka CM) మార్పు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఊహాగానాల వేళ తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారం వేళ రెండు రోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) నివాసానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు డీకే ఇంటికి సీఎం సిద్ధూ బ్రేక్‌ఫాస్ట్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఇంటికి వచ్చిన సీఎంకు డీకే ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. బ్రేక్‌ఫాస్ట్ మీట్లో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
Bengaluru | Karnataka CM Siddaramaiah reaches Dy CM DK Shivakumar’s residence, at his invitation, for a breakfast meeting
Source: Office of DK Shivakumar pic.twitter.com/fOnISUclp6
— ANI (@ANI) December 2, 2025
కాగా, శనివారం ఉదయం సీఎం ఇంటికి డీకే వెళ్లిన విషయం తెలిసిందే. అల్పాహారం సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి పార్టీ శ్రేణులకు ఐక్యతా సందేశం ఇచ్చారు. డీకే శివకుమార్ తనను మంగళవారం అల్పాహారానికి తన ఇంటికి రావాలని కోరారని.. ఇంకా అధికారిక ఆహ్వానం అందలేదని సీఎం అన్నారు. ఆహ్వానిస్తే తాను ఖచ్చితంగా వెళ్తానని.. ఆయన నుంచి ఆహ్వానం వస్తుందని అనుకుంటున్నానన్నారు. సీఎం వ్యాఖ్యలపై డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఇది తనకు సీఎంకు మధ్య ఉన్న విషయమని.. తాము అన్నదమ్ముల్లా కలిసి పని చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎంకు తన ఇంటికి అల్పాహారానికి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఇవాళ డీకే ఇంటికి అల్పాహారానికి వెళ్లారు సీఎం సిద్ధరామయ్య.
Also Read..
Metro Train | సబ్వేలో చిక్కుకుపోయిన మెట్రో రైలు.. కాళ్లకు పనిచెప్పిన ప్రయాణికులు
Dr Ganesh Baraiya: ఎత్తు 3 ఫీట్లే.. కానీ డాక్టర్ అయ్యాడు.. ఇదో సక్సెస్ స్టోరీ
తుపాకీ గురి పెట్టి..వివస్త్రను చేసి!