ముంబై, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఒక కార్పొరేట్ ఆఫీసులో మహిళ వ్యాపారవేత్త(51)ను ఒక వ్యక్తి తుపాకీతో బెదిరించి లైంగికంగా వేధించాడని, ఆమెను వివస్త్రను చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై పోలీసులు నిందితునితో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు ప్రకారం.. ఫోన్ కాల్ రావడం వల్ల 2023 జనవరి 18న బాధితురాలు మెస్సర్స్ ఫ్యానో ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసుకు వెళ్లింది. అక్కడ ఆ కంపెనీ ఎండీ జాయ్జాన్ పాసల్ ఆమెను తన క్యాబిన్‌కు తీసుకెళ్లి తుపాకీ గురి పెట్టి ఆమెతో బలవంతంగా బట్టలు విప్పించారు. ఆ తర్వాత లైంగికంగా వేధించారు. ఆ సమయంలో వెనుక నిలబడి ఉన్న ఇతర నిందితులు తన ఫొటోలు, వీడియోలు తీశారని ఆ మహిళ ఫిర్యాదులో పేరొంది.